వైభవంగా విష్ణు సహస్ర నామ పారాయణం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 07 (జనం సాక్షి):వరంగల్ తూర్పు నియోజకవర్గం బట్టల బజారులోని బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం భక్తులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని వైభవంగా నిర్వహించారు అంతకుముందు శ్రీ కృష్ణ తిరునక్షత్రం సందర్భముగాఉదయం -8:00 గంటలకు శ్రీ కృష్ణ పెరుమాళ్ళ కు అభిషేకం నిర్వహించడం జరిగింది. మరియు సాయంత్రం 6:30నిమిషాలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం 7:00గంటలకు అర్చన 7:30నిమిషాలకు నివేదన తీర్థ ప్రసాద గోష్టి జరిగింది శ్రీ కృష్ణ తిరునక్షత్రం శ్రీ వేంకటేశ్వర సేవా సమితి -2 వారి సహకారముతో నిర్వహించబడింది. కార్యక్రమంలో ఫస్ట్ సబ్ కోర్టు న్యాయమూర్తి నర్సింహామూర్తి సుధ దంపతులతో పాటు మరియు డివిజన్ కార్పొరేటర్ గందే కల్పనా నవీన్ కుమార్ సేవాసమితి సభ్యులు ఆలయ వంశపారం పర్య ధర్మకర్త శ్రీనివాసచార్యులు అర్చకులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నట్టుగా ఆలయ కార్యనిర్వాహణాది కారి ఎలపాటి రత్నాకర్ రెడ్డి భక్తులు అధికంగా పాల్గొన్నారు.