వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు
దుర్గమ్మసన్నిధిలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
విజయవాడ,ఆగస్ట్31(జనం సాక్షి): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ శోభ సంతరించుకుంది, శక్రవారం కావడంతో సామూహిక వరలక్ష్మీవ్రతాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. మల్లికార్జున మండపంలోని ఆరో అంతస్తులో ఈ కార్యక్రమం చేపట్టారు. రెండు విడతలుగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వారిని మొదటి విడతలో వరలక్ష్మి వ్రతాలకు అనుమతించారు. ఉదయం 10 గంటల సమయం నుంచి ఉచితంగా వ్రతాలను జరుపుతున్నారు. దీనికోసం 300 మంది మహిళలు రిజిస్టేష్రన్ చేయించుకున్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అమ్మవారి దర్శనం ఉచితంగా కల్పించారు. మహిళలు పెద్ద ఎత్తున మజారై అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అలాగే దర్శనం కోసం కూడా భక్తులు తరలివచ్చారు.