వైశ్య సంఘం ఆధ్వర్యంలో పరువురికి సన్మానం
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 18 : చేర్యాల మండల కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, పేద వైశ్యుల ఉపాధి గురించి ఒక లక్ష రూపాయల వస్తువుల పంపిణీ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన తోట పరమేశ్వర్ కు సన్మానం, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కందుకూరి సిద్ధి లింగం కు, చేర్యాల మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు నాగమల్ల కృష్ణమూర్తి, కార్యవర్గం సభ్యులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి గార్డెన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి తడక.లింగం కోశాధికారి అత్తెల్లి లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు వంగపల్లి వెంకటేశం, మాంచాల ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల పాండురంగం, బాశెట్టి బుచ్చిరాములు, అయిత రవి, కందుకూరి సిద్ధి లింగం, సిద్ధి బిక్షపతి, ఉప్పల నాగరాజు, తోట పరమేశ్వర్ మహిళా నాయకురాలు తోట పద్మ, మహిళా విభాగం కోశాధికారి మర్యాల వాణి తదితరులు పాల్గొన్నారు.