వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం
బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్
అమరావతి,ఫిబ్రవరి11(జనంసాక్షి): ఎపిలో అధఙకార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. బాబు విశాఖకు వ్యతిరేకం అన్న ముద్ర వేస్తున్న వైసిపి విశాఖను రాజధాని చేయాలన్న పట్టుదలతో అమరావతిని పక్కన పెట్టారు. దీనిపై కోర్టులో కేసు తేలాల్సి ఉంది. అమరావతి ఉద్యమం కూడా తారాస్థాయికి చేరింది. విశాఖ ఉద్యమం కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో విశాఖ రాజధానికి బాబు వ్యతిరేకం అంటూ ప్రచారం కూడా చేశారు. మొత్తంగా ఇప్పుడు వైసిపిని టిడిపి టార్గెట్ చూస్తూ పోతున్నది. మరోరెండేళ్ల తరవాత కానీ ఎన్‌ఇనకలు లేవు. ఈ క్రమంలో బిజెపి,జనసేనలు కూడా తమవంతుగా పోరాడుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వైసిపిని మట్టి కరిపించేందుకు ఇదే మార్గమని వాదిస్తున్న వారూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. డబ్బుల పందేరంతో ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. పాలనలో బిజీగా ఉంటూనే టిడిపిని అడ్డుకునేలా వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంది. మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అంతర్గత కలహాలు వీడి పార్టీకోసం పనిచేయాలని గట్టిగానే శ్రేణులకు ఆదేశాలు ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధుల మధ్య నిప్పులేకుండానే తగలపడేంతగా విభేదాలు రాజుకున్నాయి. గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్ మధ్య విభేదాలు సీఎం వరకూ వెళ్లాయి. తాజాగా నరసరావుపేట ఎంపీ, ఆ పరిధిలోని మహిళ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చరచ్చయ్యాయి. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో అప్పటికప్పుడు సైలెంటయినా, లోలోపల వారిద్దరూ ఇంకా రగిలిపోతూనే వున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అలాగే, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యేలకీ మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందని తెలుస్తోంది. కర్నూలులోఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోంది. ప్రతి జిల్లాలో ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల విభేదాలతో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి జగనేమో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశాలిస్తున్నారు. కానీ నేతలేమో బాహాటంగానే తమ విభేదాలను ప్రదర్శిస్తున్నారు. టిడిపిని అడ్డుకోవడం ద్వారా అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రధాన కర్తవ్యం టిడిపిని ఎండగట్టడం అన్న సూత్రంతో ముందుకు సాగాలని నిర్ణయించడంతో అడ్డుకుంటున్నారు. ఇకపోతే నేతల అరెస్ట్‌తో వైసిపి తీరుపైనా ప్రజల్లో అసహనం నెలకొంది. టిడిపి నేతలను ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేసి వేధించడం పనిగా పెట్టుకున్నారు.