వై. సి. ఓ. ఎ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని వైసీఓఏ క్లబ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిధులు గా ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ మరియు సేవా అధ్యక్షురాలు నిమ్మి ఆనంద్ హాజరైనారు. ఈ సందర్భంగా వై సి ఓ ఏ క్లబ్ నందు చిన్నారులు కృష్ణుడు మరియు గోపికల అవతారాలతో, మహిళలు కోలాటం అందరిని అలరించారు. తదుపరి కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం మల్లారపు మల్లయ్య, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పంజాల శ్రీనివాసు, మహిళా క్లబ్ మెంబర్స్, వై సి ఓ ఏ క్లబ్ కమిటీ సభ్యులు మరియు అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.