వ్యవసాయం తరవాత చేనేతదే పెద్ద పరిశ్రమ
` వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు
` నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు
` తెలంగాణ వచ్చాకనే నేతన్నలకు అండగా నిలిచాం
` పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు చేనేత కార్మికుల కన్నీటి గాధలు తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు బతుకులు ఆగమయ్యాయని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటివరకు 5 వేల 752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు.నూలు, రసాయనాల విూద 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నలకు సంబంధించి ఏమైనా పాత బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నేతన్నల డిజైన్లను ఎవరైనా కాపీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. ఇప్పటి వరకు 37 వేల వరకు మర మగ్గాలు, 16 వేల వరకు చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా రైతు బీమా లాగానే చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం బీమా ఇస్తోందని, దురదృష్టవశాత్తు ఎవరైనా చేనేత కార్మికుడు చనిపోతే వారం రోజుల్లో రూ.5 లక్షలు బీమా చెల్లిస్తున్నామని తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులకు నెలకి రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నామని మంత్రి వెల్లడిరచారు. పద్మశాలిల కోసం కోకాపేటలో పద్మశాలి ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల వృత్తులను కాపాడుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చేనేత కళాకారులను అనేక పథకాలతో కేసీఆర్ ఆదుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత, జౌళి రంగం అని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంపై కేసీఆర్‌కు మొదట్నుంచి అవగాహన ఉంది. దుబ్బాకలో హైస్కూల్‌లో చదువుకున్న సమయంలో పద్మశాలీ ఇంట్లో ఉండేవారు. అప్పట్నుంచే చేనేత కళాకారుల కన్నీళ్ల గురించి కేసీఆర్‌కు తెలుసు. భూదాన్ పోచంపల్లిలో ఒకటే వారంలో ఎనిమిది మంది చేనేత కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ చలించిపోయి, జోలేపట్టి డబ్బులు సేకరించి, లక్ష రూపాయాల చొప్పున ఇచ్చారు. సిరిసిల్లలో కూడా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్ల గోడల విూద రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతన్న చావొద్దు.. నీ కుటుంబం ఉసురు పోసుకోవద్దని నాటి కలెక్టర్ రాయించి, ఆత్మస్థైర్యం నింపారు. సిరిసిల్లలో తొమ్మిది మంది నేతలు బలవన్మరణం పాల్పడితే.. వారిని ఆదుకోవాలని నాటి ముఖ్యమంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. కానీ స్పందించలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్‌ఎస్ నుంచి రూ. 50లక్షలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి. ఆత్మహత్యలు ఆపండి అని కేసీఆర్ నాటి అధికారులను ఆదేశించారు. ఆనాడు విూ కష్టాలను అర్థం చేసుకుని, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత, జౌళి బ్జడెట్ ను రూ. 70 కోట్ల నుంచి రూ. 1200 కోట్లకు పెంచారు. చేనేత, జౌళి శాఖకు ఇప్పటి వరకు రూ. 5,752 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అధికారులను పిలిచి సీఎం సవిూక్షించారని కేటీఆర్ గుర్తు చేశారు. నెలకు ఎంత ఆదాయం వస్తున్నదని అడిగారు. విూ డిజైన్లను కాపీ కొడితే కఠినంగా కేసులు పెట్టి, లోపల వేయించే బాధ్యత తీసుకుంటాను. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు. చేనేత మిత్ర ద్వారా నలభై శాతం నూలు, రసాయనాల విూద సబ్సిడీ ఇస్తున్నాం. పాత బకాయిలు ఉంటే వాటిని కూడా సంపూర్ణంగా విడుదల చేయిస్తామన్నారు. నేతన్నకు చేయూత అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా కరోనా సమయంలో 26 వేల మంది కార్మికులకు లాభమైందని కేటీఆర్ తెలిపారు.
(చేనేతపై జిఎస్టీని ఎత్తివేయాలి
ప్రధాని మోడీకి లేక రాస్తున్నట్లు కెటిఆర్ ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి): ఇది మాటల ప్రభుత్వం కాదు.. ఇది చేతల ప్రభుత్వం.. ఇది చేనేతల ప్రభుత్వం.. ఇది విూ ప్రభుత్వం అని కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధాని మోదీ అని దుయ్యబట్టారు. చేనేత విూద విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి మొట్టమొదట నేనే లేఖ రాస్తున్నాను. విూరంతా కూడా లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తానే తొలి లేఖరాస్తున్నాని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. నారాయణపేటలో చేనేత పార్కు పెడుతామని అమిత్ షా ఆరేండ్ల కింద చెప్పారు. ఇప్పటి వరకు అతీగతి లేదు. బీజేపీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.చేనేతలకు అండగా నిలుస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని మండిపడ్డారు. చేనేతల చేయూతల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు అమలు చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలను ఎత్తి వేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయని విధంగా చేనేతపై ఐదు శాతం జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీ అని విమర్శించారు. అవసరమైతే చేనేత రుణమాఫీకి మరోసారి ఆలోచిస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నకు బీమా కల్పిస్తున్నాం. నేతన్నకు బీమా ఈ దేశ ప్రధాని ఆలోచించలేదు. కానీ కేసీఆర్ నేతన్న బీమా పథకం తీసుకొచ్చి చేనేతల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వారం రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
(లిజ్ రాజీనామా సరే..మరి మోడీ సంగతేంది?
` ఆర్థికంగా భారత్ దివాళా తీస్తున్నా పట్టింపు ఏదీ!
` ట్విట్టర్ వేదికగా కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్(జనంసాక్షి): సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేసినప్పటికీ..ఇదే విషయంలో మనదేశ ప్రధాని మోడీ మాత్రం పెద్దగా ఆందోళనకు గురవుతున్నట్లుగా లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. బ్రిటన్ ప్రధాని లిజ్ బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత ప్రధాని దేశాన్ని దివాళా తీస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం ఆర్థికంగా చాలా హీనస్థితికి చేరిందన్నారు. గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉందన్నారు. గడిచిన 45 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం కూడా ఏర్పడిరదన్నారు. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా మన దగ్గర ఉన్నట్లు మంత్రి తెలిపారు. అమెరికాతో డాలర్‌తో పోలిస్తే ఇండియాలో ప్రస్తుతం రూపాయి విలువ అత్యంత దారుణంగా పతన మైందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్ బాబు కూడా భారత్‌లో జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా అధికంగా ఉందని, నిరుద్యోగ యువత అధిక స్థాయిలో ఉందని, రూపాయి విలువ కూడా షాకింగ్ రీతిలో పతనమైనట్లు ప్రొఫెసర్ కౌశిక్ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచంలోనే ముందున్న ఇండియాకు ఇలాంటి అంశాలు చేదు చేస్తాయని కౌశిక్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈ సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయని, కానీ విభజించు పాలించు అనే రాజకీయాలు ఈ సమస్యల్ని మరింత పెద్దవిగా మారుస్తున్నట్లు ప్రొఫెసర్ కౌశిక్ తెలిపారు.