వ్యవసాయక్షేత్రంలో ఎద్దులు పొడిచి రైతు మృతి

కరీంనగర్‌,  వ్యవసాయ పనుల కోసం తాను పెంచుకున్న ఎద్దులు పొడవడంతో ఓ రైతు మరణించిన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో శనివారం జరిగింది. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో నరహరి రాఘవరెడ్డిని తన ఎద్దులే పొడిచాయి. ముందు ఓ ఎద్దు పొడిచింది. దీంతో రెండో ఎద్దు కూడా అతన్ని పొడిచింది. రెండు ఎద్దుల దాడిలో తీవ్రంగా గాయాల పాలైన నరహరి రాఘవరెడ్డిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఈ సంఘటనతో రైతు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.