వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. -మంత్రి కేటీఆర్

జహీరాబాద్ జూన్ 22( జనంసాక్షి) వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టం అని  ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో  బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో పని చేసిన ప్రభుత్వాలు మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. 50 లక్షలు ఇస్తే గతంలో పాలించిన ప్రభుత్వాలు  ఎంతో గొప్పగా చెప్పుకొనేవారన్నారు. వార్డు కు రెండు లక్షల చొప్పున వచ్చేవి అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్  మున్సిపాలిటీ అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్  50 కోట్లు మంజూరు చేశారు అన్నారు. అప్పటినుంచి  జహీరాబాద్ రూపురేఖలు మారిపోయింది అన్నారు. నేను చిన్నప్పుడు చూసిన జహీరాబాద్ కు, ఇప్పటి జహీరాబాద్ కి చాలా తేడా ఉంది అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం లో  రాష్ట్రంలోని ప్రతి పట్టణం డెవలప్ అవుతుంది అన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డి కి మంత్రి పదవి వచ్చింది కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఎము రాలేదు అన్నారు. మన ఎమ్మెల్యే, మాణిక్ రావు, ఎంపీ బిబి పాటిల్ పని మంతులు అని వారు ఎల్లపుడు అభివృద్ధి కి కృషి చేస్తున్నారు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫరిదొద్దీన్ జహీరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు అని గుర్తు చేశారు. ఎప్పటికి హైదరాబాద్ వచ్చిన ప్రతి సారి జహీరాబాద్ కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగేవారన్నారు. రాహుల్ గాంధి మొన్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్స్ పార్టీకి  ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు. కాంగ్రెస్స్ కు 50 సార్లు అవకాశం ఇచ్చిన ఎం చేయలేదు.. ఇప్పుడు అవకాశం ఇస్తే ఎం చేస్తారు అని ప్రశ్నించారు.గతంలో ఉన్న పింఛన్లకు ఇప్పుడు పది రేట్లు పెరిగింది..బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ  అన్నారు.సంగమేశ్వర, బసవెశ్వర పూర్తి చేసి ఈ జిల్లాకు సాగు నీరు అందిస్తాం అన్నారు.గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే వారు..కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అన్నారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.65 ఏళ్ళ నుండి పలు పార్టీలు చేసిన గబ్బును, దరిద్రాన్ని ఇప్పుడు ఇప్పుడే వదల గొడుతున్నాం అని తెలిపారు. సాగునీరు,తాగు నీరు, వైద్యం ఇలాంటి పనులు చేసుకుంటూ మనము పోతు ఉంటే.. కొంతమంది కులాల మధ్య,మతాల మధ్య గొడవలు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు అని అలాంటి వాళ్ళను తరిమికొట్టాలి అన్నారు.దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర ముందుకు పోతుంది అన్నారు. ఎమ్మెల్యే మణిక్ రావు అడిగిన నిధులను వెంటనె  మంజూరు చేస్తామని వాటితో పట్టణ అభివృద్ధి చేసి ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బిబి పాటిల్ జిల్లా మంత్రి హరీష్ రావు తో కలసి ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ఎంపీ బిబి పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, తెరాస సీనియర్ నాయకులు తన్వీర్, విజయ్ కుమార్, గుండప్ప, మ్యాతరి ఆనంద్,ఇజ్రాయెల్ బాబీ, నామా రవికిరణ్,  జహీరాబాద్ ఝరా సంగం న్యాలకల్ కోహిర్ మొగుడం పల్లి మండలాల అధ్యక్షులు ఎంజి రాములు, రాచయ్య స్వామి  రవీందర్, నర్సిములు, శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోహిఉద్దీన్, తెరాస నాయకులు ప్రజా పత్రినిధులు, తదితరులు పాల్గొన్నారు.