వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్తింపు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్తింపు.

తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా
వర్త్య విఠల్ నాయక్ రెండు సంవత్సరాల పాటు తన పదవి కాలం విశేషంగా కొనసాగించి అందరి మన్ననలు పొందారు. గత 15 రోజుల క్రితం తాండూర్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధికా రికంగా ప్రకటించడంతో వర్త్య విట్టల్ నాయక్ మాజీ అయ్యారు.రెండు సంవత్సరాల పాటు పదవి కాలంలో మార్కెట్ కమిటీకి అనేక సేవలందించి ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థానం సంపాదించారు.అదేవిధంగా ఆలయాలకు తనవంతు ఆర్థిక సహాయం అందజేసి భగవం తుని కృపకు పాత్రులయ్యారు. అటు రాజకీయ రంగంలోను ఇటు భగవంతుని సెవాకార్య క్రమాలలో తనదైన శైలిలో కొనసాగు తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ రాజకీయా లలో క్రీయశీలక పాత్రపోశిస్తూన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తూన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం మారు మూల గ్రామమైన బానాపూర్ తండాలో వర్త్య వాల్యా నాయక్ సీతబ్బాయి దంపతులకు వర్త్య విఠల్ నాయక్ జన్మించి నేడు జిల్లాలోనే ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతున్నారు. వినాయక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తూ అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుకల్పించారు. వినాయక ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సేవలను గుర్తించి సన్మానాలు అవార్డుల సైతం అందుకున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయ్యారు. అయితే త్వరలోనే జిల్లా లోనే కనివిని ఎరుగని నామినేటెడ్ పోస్టు లభించ బోతుందని విశ్వసనీయ సమాచారం.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూర్తి సహకారం తోనే ఇంతటి గుర్తింపు లభించిందని చెప్పుకొచ్చారు. జీవితాంతం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కి రుణపడి ఉంటానని తెలిపారు.దత్తాత్రేయును కృపతో ఉత్తమ పోస్టు లభించాలని కోరుకుందాం..