వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం

టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో అప్రకటిత తరచూ విద్యుత్ సరఫరా అంతరాయంతో మోటార్లు నడవక మిరప తోటలు సాగు చేసే తరుణం కావడంతో కూలీలతో మొక్కలు నాటే పనులు ముమ్మరం తో సమస్యలు తలెత్తుతున్నాయి. మండలంలో వేల ఎకరాలలో మిర్చి నాటే సమయం ఆసన్నమై రైతులు ముమ్మరంగా ఆ పనుల్లో నిమగ్నం కాగా మొక్కలు నాటుతున్న తరుణంలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక విద్యుత్ సిబ్బంది విద్యుత్ అంతరాయాలకు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ సరఫరా సక్రమంగా రాకపోవడంతో రైతులు విద్యుత్ సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో శాశ్వత పరిష్కారాలు పరిష్కరించి విద్యుత్ సరఫరా లో ప్రకటిత కోతలు లేకుండా సరఫరాలో అంతరాయాలు లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.