వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్
రుషికొండ భవనాలపై సిఎం చంద్రబాబు దృష్టి
విశాఖలో డంపింగ్ యార్డును పరిశీలించిన నారాయణ
విశాఖపట్టణం,ఆగస్ట్27 (జనం సాక్షి): వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎª`లాంట్‌ను సందర్శించారు. అనంతరం నారాయణ విూడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని.. అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటా రన్నారు. ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడా అమలు చేస్తాం. వైకాపా హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. గత ఐదేళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ఎª`లాంట్‌కు రాలేదు. 2023లో రూ.450 కోట్ల నిధులు వస్తే వాటినీ పక్కదారి పట్టించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్ శాఖకు ఇచ్చారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుంది. సెప్టెంబర్ 13న మరో 75 క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నా. నిర్మాణాలు వదులుకోకపోతే మేమే స్వాధీనం చేసుకుంటాం. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టాం అని నారాయణ తెలిపారు. విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు.