శంకర్రావు అరెస్టుపై ఎంపి పొన్నం ఆవేదన

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ దళిత ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.శంకరరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చి దస్తులు మార్చుకుంటున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. దళిత శాసనసభ్యుడైనంత మాత్రాన ఇలా చేయడం అన్యాయమని అన్నారు. భూ వివాదం, మరే వివాదం పైనా నేరారోపణలు వచ్చినప్పటికీ అరెస్టు చేయవద్దనడంలేదని, స్టేషన్‌కు పలిపించి విచారించాల్సింది పోయి పోలీసులు ఆయనను ఇంటికే వెళ్లి అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కాంగ్రెస్‌ నేతలు చీవాట్లు పెట్టడంతో పోలీసులు వదిలిపెట్టారని అన్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనను ఎలా తీసుకెళ్లారో తిరిగి ఆయనను అదే విధంగా ఇంటికి తీసుకురాకుండా మార్గమధ్యంలోనే వదిలివేయడం ఏమిటని ప్రశ్నించారు. శంకరరావును అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పొన్నం డిమాండ్‌ చేశారు. లేనిచో ఈ విషయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి తెలియజేస్తామని అన్నారు.