శక్తి కేంద్ర ఇంచార్జి లతో జరిగే సన్నాహక సమావేశం విజయవంతం చేయండి
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో బుధవారంనాడు శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో సమావేశం ఏర్పాటు చేసున్నట్లు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జూలై 3 వ తారీఖున హైదరాబాద్ లో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ విజయవంతం చేయడం గురించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మా రెడ్డి అధ్యక్షతన శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో సన్నాహక సమావేశం నిర్వహిస్తారని,ఈ సమావేశానికి గడిల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, శక్తి కేంద్రాల ఇన్చార్జిలు అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.