శబరిమల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఆలయ అధికారులకు కనువిప్పు కావాలి

మహిళలను అవమానించగడం కన్నా గౌరవించడం మేలు

న్యూఢిల్లీ,జూలై19(జ‌నం సాక్షి): శబరిమలలో మహిళలకు దర్వనం కల్పించే విషయంలో ఇంతకాలం ట్రావెంకూర్‌ దేవస్వం బోర్డు అనుసరించిన విధానం ఇక రద్దు కానుంది. ఇది దేవుడి పట్ల ఉన్న వివక్షను తొలగించేదిగా ఉంది. ఆలస్యంగా అయినా మహిళల పట్ల ఉన్న చూపును సుప్రీం తోసిపుచ్చింది. నిజానికి మహిళలు రుతక్రమం సమయంలో దేవాలయాలను సందర్శించరు. కొన్ని ప్రాంతాల్లో అసలు ఇళ్లల్లో కూడా కలసి తిరగరు. ఇది మహిళలు తమకు తాముగా విధించుకున్న కట్టుబటు. అలాంటిది దేవుడిని సందర్శించే సమయంలో ఇంకా పవిత్రంగా ఆలోచిస్తారు. ఈ విషయంలో శబరిమల విషయంలో అక్కడి అధికారులు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలా దర్గాల్లో మహిళలకు ప్రవేశం లేకపోవడంపై పోరాడి గెలిచారు. అందుకే దైవాన్ని అర్థించే హక్కు మహిళలకు పురుషులతో సమానంగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. శబరిమల ఆలయంలోకి 10నుంచి 50 మధ్య వయస్సు మహిళల ప్రవేశంపై విధించిన నిషేధం చట్టబద్ధతను పరిశీలిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఏ ప్రాతిపదికన ప్రవేశాన్ని నిరాకరిస్తారని ప్రశ్నించడం ద్వారా మహిళలకు అండగా నిలిచింది. ఇది రాజ్యాంగ శాసనానికి వ్యతిరేకం. విూరు ప్రజలందరికీ అనుమతిస్తున్నారంటే ఎవరైనా రావచ్చన్న మాటే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆలయ అధికారులకు స్పష్టం చేశారు. జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ట్రావెంకోర్‌ దేవస్థానం బోర్డు ఆలయంలోకి వచ్చే మహిళా భక్తులకు వయస్సు ధ్రువీకరణ గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. 800 ఏళ్లుగా ఈ ఆలయంలో మహిళలకు నిషేధం కొనసాగుతోంది. నిషేధం ఎత్తేసే విధంగా ఆలయ బోర్డుకు, జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం కోరుతోంది. అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని కేరళ మంత్రి కె.సుదర్శన్‌విలేకరులకు తెలిపారు. దీంతో ఇక మహిళలు నేరుగా అయ్యప్ప స్వామిని దర్శిచుకునే వీలు ఉంటుంది. అలాగే మహిళలు తమకుతాముగా రుతక్రమ సమయంలో బయటకు రానేరారు. ఆలయాల్లోకి అసలు రారు. ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. ఈ రకంగా వారిని ఇంతకాలం అవమానించినందుకు మనమే సిగ్గుపడాలి. సగర్వంగా వారిని అయ్యప్ప సన్నిధికి అనుమతించి గౌరవించడం మంచిది.