శరవేగంగా దుర్గమ్మ వారధి పనులు

సకాలంలో పూర్తి చేసేలా చర్యలు

విజయవాడ,జూలై25(జ‌నంసాక్షి): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓర్‌ పనులు చకచకా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అయినా పనులు చురకుగా సాగుతున్నాయి. ఈమేరకు సిఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో పనులు సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకు కృష్ణానది వెంట రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ముందుగా ఘాట్ల నిర్మించారు. మిగిలిన దశల్లో అనేక పనులు నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో యూటీ పరిధిలోకి వచ్చే ప్రాంతం అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరూ ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకోవటానికి వీలుగా, ఘాట్లకు వెళ్ళేవారికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అప్రోచలను శ్లాబ్‌ విధానంలో వేయాలని సీఎం సూచించారు. దీంతో ప్రతిపాదనను కేంద్రానికి కూడా పంపించారు. డిజైన్లను మార్చటం వల్ల కొంత

అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. దుర్గా ఫ్లై ఓవర్‌ అనుసంధాన యూటీ పనుల డిజైన్ల మార్పునకు

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి నివేదించింది. యూటీకి రెండు వైపులా అప్రోచ పనులను గోడకట్టి మట్టితో నింపే బదులు స్లాబ్‌ విధానం విషయమై డిజైన్ల మార్పునకు ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ త్వరగా పనులు పూర్తి చేసేలా ఎంపి నాని, మంత్రి దేవినేని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలి కాలంలో దుర్గా ఫ్లై ఓవర్‌ , నాలుగు లేన్ల రోడ్ల విస్తరణకు సంబంధించి సిఎం బాబు సవిూక్షించారు.

యూటీ పనులు పూర్తయిన నేపథ్యంలో అప్రోచ్‌ పనులకు స్టేట్‌ హైవేస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యూటీకి రెండువైపులా అప్రోచ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. అప్రోచలకు ముందుగా వాల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మట్టిని పోసి వైబ్రేషన ఇచ్చిన తర్వాత హాట్‌మిక్స్‌, వెట్‌మిక్స్‌ వేసిన తర్వాత బీటీ వేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల కింద ఉన్న ప్రాంతం అంతా మూసుకుపోతోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సూచించారు. కృష్ణలంక జాతీయ రహదారిపై అండర్‌ టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. యూటీకి అనుబంధంగా కింద వాల్‌నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో అప్రోచ పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించనున్నారు. పిల్లర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మార్చిలో శ్లాబ్‌ పనులు చేపట్టటానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజావార్తలు