*శాంతియుతంగా వీఆర్ఏల ధర్నా*
ఉండవల్లి,సెప్టెంబర్ 14(జనంసాక్షి):
డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు బుధవారంతో 52వ రోజుకు చేరాయి. మంగళవారం వీఆర్ఏల చలో అసెంబ్లీ కార్యక్రమాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచి మళ్లీ రెండవసారి చర్చిద్దాం అని తెలిపారని అంతవరకు పాము శాంతియుతంగానే ధర్నా చేస్తామని వీఆర్ఏలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు, కో కన్వీనర్ షేక్షావలి, నారాయణ, కృష్ణ, నాగవేణి, జహాదా, గజేంద్ర గౌడ్, యాదగిరి జమీలాభి, బాబు తదితరులు పాల్గొన్నారు.
Attachments area