శాంతియుతంగా సంపూర్ణ సంక్షేమాలతో సమర్థవంతమైన పాలన: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 8 జనం సాక్షి:తెలంగాణలో శాంతియుతంగా సంపూర్ణ సంక్షేమాలతో సమర్థవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ సమాజం రుణపడి ఉండాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో, తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 100% సబ్సిడీతో ముస్లిం మైనార్టీలకు మంజూరైన లక్ష రూపాయల* చెక్కులు 65 మంది* లబ్ధిదారులకు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా సార్వభౌమత్వంతో శాంతియుతంగా సంపూర్ణ సంక్షేమాలతో సమర్థవంతమైన ప్రజాపరిపాలన కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ కమల్ రెడ్డి ఎంపీడీవో సత్తయ్య మోమిన్ పేట రైతుబంధు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి మోమిన్ పేట మండల పార్టీ అధ్యక్షులు డి వెంకట్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.