శాపగ్రస్త జీవులు …
ఈ వ్యవస్థచే నిషేధానికి గురైనోళ్లు
వివక్షతల దాస్తికంలో దగ్దమౌతునోళ్లు
మనుషులుగా గుర్తింపు నోచుకోనోళ్లు
చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నోళ్లు
దేశ పౌరులైనా …
ఏ హక్కులు దక్కనోళ్లు
ఏ ప్రగతి పలాలు చిక్కనోళ్లు
అయినవాళ్లకు …
అనుబందాలకు దూరమై …
ఒంటరి పయనం సాగిస్తున్నోళ్లు
అడుగడుగునా అవమానాలు
దారి పొడవునా ఛీత్కారాలతో
క్షణక్షణం చస్తూ బతుకుతున్నోళ్లు
ఆకతాయిల వెకిలి పలుకులకు
కామోన్మాదుల వికృత చేష్టలకు
విసిగి వేసారిన విధి వంచితులు
ఉపాధి కోసం భిక్షాటనతో
పొట్ట పోసుకునే ఆభాగ్య జీవులు
తరతరాల శాపగ్రస్త జీవులు
వీళ్ళే కొజ్జా, హిజ్రా, థర్డ్ జెండర్లు
జంతువుల కన్నా హీనంగా
బతుకీడుస్తున్న ఈ నిర్భాగ్యులను
సమాజం మనుసులుగా గుర్తిస్తే …
చేరదీసి కాసింత చేయుత అందిస్తే
మోడుబారిన బతుకులు …
మళ్ళీ కొత్త చిగురు తొడిగేను
అంధకారమైన మోముల్లో …
పండు వెన్నెల వెలుగులు చిందేను