శిక్షణ పొందిన మహిళలకు కత్తెరలు పంపిణీ
చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 03 : చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో సావిత్రిబాయి పూలే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శనివారం ట్రైనింగ్ సెంటర్ లోని మహిళలందరికీ శనివారం స్థానిక గ్రామ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి చేతుల మీదుగా ఉచితంగా కత్తెరలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మీస పార్వతి టైలరింగ్ సంబంధించిన వస్తువులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణ కేంద్రం గ్రామానికి రావడం ఎంతో గర్వంగా ఉందని, మహిళలందరూ ఎంతో ఓర్పుతో కుట్టు మిషన్ శిక్షణలో మంచి నైపుణ్యతో ప్రతిభను కనబరిచారని అన్నారు. భవిష్యత్తులో మీరు మరిన్ని అవకాశాలు సంపాదించుకునే దిశలో ఎదగాలని ఆకాంక్షించారు. సెంటర్ పరంగా మిగతా ఎలాంటివి అవసరం ఉన్నా తప్పకుండా సహాయం చేస్తానని చెప్పారు. అనంతరం మీస పార్వతి మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఎదగాలని, ఇప్పుడున్న సమాజంలో ప్రతి మహిళ సాధికారత సాధించేందుకు ముందుకు వెళ్లాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామానికి తీసుకువచ్చేందుకు తప్పకుండా
తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు మేడిపల్లి చందు, జర్నలిస్టు మైసంపల్లి నాగరాజు, ట్రైనింగ్ సెంటర్ టీచర్ పెద్దింటి కౌసల్య, ట్రైనింగ్ సెంటర్ లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.