శ్మశానవాటికలను అభివృద్ది చేసుకోవాలి
దయ్యాల పేరుతో భయాలు పోవాలి
లోకేశ్‌తో కలసి వైకుంఠధామం ప్రారంభించిన కోడెల
గుంటూరు,ఆగస్ట్13(జనం సాక్షి): వైకుంఠధామం పేరుతో గుంటూరులో చుక్కపల్లి కుటుంబం శ్మశానవాటికను అధ్బుతంగా అభివృద్ధి చేసిందని స్పీకర్ కోడెల శిప్రసాదరావు అన్నారు. గుంటూరు కోరెటపాడులో మంత్రిలోకేష్‌తో వైకుంఠ ధామం ప్రారంభోత్సవంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనందబాబు, పుల్లారావు, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మోదుగుల, ఆలపాటి, ఎమ్మెల్సీ డొక్కా, జిల్లా కలెక్టర్ కోనా శశిధర్, అర్భన్ ఎస్పీ విజయరావు ఇతర నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ…. దేశంలో అత్యంత అశ్రద్ధ, అపరిశుభ్రంగా ఉండే ప్రాతం శ్శశానవాటికలు. అక్కడ దెయ్యలు, భూతాలు ఉంటాయనే భావనను ప్రజలలో తోలగించి అధ్బుతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. శ్మశాన వాటికలంటే దెయ్యలు, భూతాలు కాదు దేవుళ్లు ఉంటారు. రాష్ట్రంలో అన్ని కులాలకు శ్మశానవాటికల అభివృద్ధి చేస్తామన్నారు. మనం నిర్మించుకున్న శ్మశానవాటికలు అదే విధంగా అభివృద్ధి కమిటీలు వేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గడిచిన సంవత్సర కాలంలో యువనాయకులు మంత్రిగా నారా లోకేష్ అధ్బుతమైన ప్రతిభ కనపరిచారని అన్నారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్యం వచ్చి 70సంవత్సరాలు అయినా రాష్ట్రంలో సమస్యలు అలానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలలోనే రాష్ట్రంలో నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మౌలిక సదుపాయాలు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలు స్పీకర్ కోడెల ఆధ్వర్యంలో అధ్బుతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మనం చేస్తున్న శ్మశాన వాటికల అభివృద్ధితో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది. రాష్ట్రంలో 1,107 శ్మశానవాటికలు అభివృద్ధి చేయడం జరిగింది. అవికాక మరో 5వేలు శ్మశానవాటికలు అభివృద్ధి చేస్తున్నాం. చివరిగా మనం అందరం వెళ్లేది శ్మశానానికి అలాంటి వాటిని అధ్బుతంగా అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. 2020నాటికి రాష్ట్రంలోని నూరుశాతం శ్మశానవాటికలు అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.