శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పట్టణం లోగల
శ్రీ సరస్వతి నగర్ నందు వెలసిన శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో,శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేదమంత్రాలు నడుమ కమనీయంగా జరిగింది.శుక్రవారం ఉదయం 11 గంటలకు వేద పండితులు శ్రీనివాస శాస్త్రి బృందం
శాస్త్రవేత్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు.ఆలయ కమిటీ చైర్మన్లు పాల్వాయి సోదరులు శ్రీనివాసరావు,రమేష్
లు స్వామివారి కళ్యాణానికి ఘనమైన ఏర్పాటులుచేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని,భక్తిశ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై ఏర్పాటుచేసి ఊరేగింపు చేశారు.ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కార్యక్రమంలో కొనతం చిన్న వెంకటరెడ్డి, బచ్చలకూరి ప్రకాష్,
రాము ,జెట్టి వెంకన్న,మా శెట్టి మోహన్, చిత్తలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు