శ్రీలంకలో పరిస్థితులు దారికొచ్చేనా?
కొత్త నాయకత్వం సమర్థతపైనే ఆధారం
కొలంబో,జూలై14(జనం సాక్షి
): శ్రీలంకలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిన ప్రజానీకం.. ప్రభుత్వం పై తిరగబడ్డారు. ఈ నిరసనలతో భయాందోళనకు గురైన దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మంగళవారం అర్థరాత్రి మాల్డీవులకు పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నా ఇప్పట్లో పరిస్థితులు దారికొచ్చేలా కనిపించడం లేదు. అక్కడ నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో పరిస్థితి చక్కబడడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు ఆయన పరారీ తర్వాత.. దేశంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొటబయ, ప్రధాని రణిల్ విక్రమ్ సింఫ్‌ు రాజీనామా చేయాలని.. రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేపట్టారు. పరిస్థితులు మరింత దిగజారిపోవడంతో మాల్డీవులకు పారిపోయిన గొటబాయా గురువారం అక్కడి నుండి సింగపూర్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ఆ దేశ తాత్కాలిక అధక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమ్ సింఫ్‌ు ను నియమించారు. ఈ నిర్ణయం ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహాజ్వాలలు రగిల్చింది. దీంతో ఆ దేశంలో అత్యయిక పరిస్థితి విధించారు. పౌరుల నుండి మరింత అసంతృప్తి పెల్లు బికిస్తుందని గ్రహించిన గొటబయ.. మాల్డీవుల నుండి సింగపూర్ వెళ్లేందుకు ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేజారడంతో శ్రీలంక అత్యయిక పరిస్థితి విధించింది. అధ్యక్షుడు
దేశాన్ని విడిచి పారిపోయాడన్న వార్త అక్కడి ప్రజల్లో మరింత అగ్ని రాజేసింది. దేశ అధ్యక్షుడిగా రాజీనామా చేయాల్సిన బుధవారమే మాల్డీవులకు పారిపోయాడన్న వార్త దావనంలా వ్యాపించడంతో.. ఆందోళనకారులు పెద్దయెత్తున నిరసన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నివాసానికి 200 విూటర్ల దూరం నుండి గుంపుగా నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను భద్రతా దళాలు వినియోగించాయి. భాష్ప వాయువులు ప్రయోగించినా.. ప్రధాని నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి.. ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నివాసం ఎదుట పెద్దయెత్తున ఆందోళనకారులు గుమిగూడారు. తాము పార్లమెంట్‌కు కూడా ర్యాలీ చేపడతామని, అధ్యక్షుడు పదవీవిమరణ చేసేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికజరగాల్సి ఉంది. అలాగే ఆర్థిక స్థితిని గాడినపెట్టాల్సి ఉంది. ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఉదారంగా ఆదుకుంటే తప్ప పరిస్థితి దారికొచ్చేలా లేదు. అపపటి వరకు ఈ దుస్థితి కొనసాగడంఅనివార్యం కావచ్చు. కొత్త నేతలు దేశాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళతారన్న దానిపైనే ప్రజల ఆగ్రహాలు చల్లార్చగలవు.