శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి
తిరుమల,సెప్టెంబర్28(జనంసాక్షి ): తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కొత్తగా 16 ఈ.ఎస్.ఐ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం అని గంగ్వార్ తెలిపారు. ఈ.ఎస్.ఐ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నాం అని ఆయన అన్నారు.