శ్రీవారిని దర్శించుకున్న కామినేని, పరిపూర్ణానంద

అర్చకవ్యవస్థలో ప్రభుత్వ జోక్యం తగదు
తిరుమల,జనవరి3(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భాజపా నేత కామినేని శ్రీనివాస్‌, ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణాంద స్వామి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పండితులు వారికి  వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. రాజకీయ నాయకులు అసభ్య పదజాలంతో కాకుండా ఆదర్శంగా మాట్లాడడం నేర్చుకోవాలని తరవాత కామినేని శ్రీనివాస్‌ అన్నారు. దేవాలయ వ్యవస్థపై ప్రభుత్వాల మితివిూరిన అజమాయిషీ సబబు కాదని స్వామి పరిపూర్ణానంద అన్నారు.
కేరళ ప్రభుత్వం తీరు కుట్రపూరితమని పరిపూర్ణానంద స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై ఆయన స్పందిస్తూ కేరళ ప్రభుత్వం హిందూ మనోభావాలను దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహరంపై కేరళ సీఎం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అర్చక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం సరికాదని పరిపూర్ణానంద స్వామి అన్నారు.