శ్రీ కోదండ రామాలయం లో వరలక్ష్మీ వ్రతం
టేకులపల్లి ఆగస్టు 19( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో గల శ్రీ కోదండ రామాలయంలో శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వహించారు . శ్రీ కోదండ రామాలయంలోని అర్చకులు శ్రీరంగం అజయ్ సాయి చక్రిచే, ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు . ఈ వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కోరం ఉమా సురేందర్, గోల్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్, టేకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత, టేకులపల్లి మాజీ సర్పంచ్ ఇస్లావత్ పార్వతి, మహిళలు పాల్గొన్నారు