శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానం లో కార్తీక దీపాలు

జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి)శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట లో భక్తులు కార్తీకమాసం దీపారాధన చేసి శ్రీ రాచణ్ణ స్వామి వారికి అభిషేకం అమ్మ వారికి కుంకుమార్చన చేశారు. మంగళవారం పాక్షిక చంద్ర గ్రహణం ఉన్నందున భక్తులు కార్తీకమాసం దీపారాధన చేశారు.ఆలయంలో  అన్న దానం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గంటలకు దేవాలయం ద్వారములు తెరిచి ఆలయ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిత్య నివేదన చేసి స్వామి వారి మంగళా హారతి నిర్వహించిన తర్వాత ఆలయం ద్వారములు మూయబడును అని ఆలయ ఈవో తెలిపారు. బుధవారం ఉదయం 5 గంటలకు దేవాలయం ద్వారములు తెరిచి ఆలయ సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు స్వామి వారి దర్శనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు సహకరించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి విభూతి శివరుద్రప్ప తెలిపా