శ్రీ రాజరాజేశ్వర(గుండం)ఆలయాన్ని దర్శించుకున్న అటవీశాఖ అధికారి
ప్రత్యేక పూజలు చేసిన నర్సంపేట అటవీశాఖ అధికారి రమేష్
కొత్తగూడ ఆగస్టు 22 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో కాకతీయుల నాటి అతి పురాతన చరిత్ర కలిగిన ప్రత్యేకమైన(రామక్క గుడి)శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నర్సంపేట రేంజ్ అటవీశాఖ అధికారి బల్లేడి రమేష్ దంపతులు కుటుంబ సమేతంగా మహా శివుని దర్శించుకుని గుడి ప్రాంగణంలో తులసి కోట ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు.గత కొద్ది రోజుల క్రితం గుడి ప్రాంగణంలో మహాశివునికి ఇష్టమైనటువంటి నారా యాప మొక్కను మహా పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం నుండి ప్రత్యేకంగా తెప్పించి ఆలయ ప్రాంగణంలో నాటారు.వీటితో పాటుగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక ద్వారానికి 25 వేల తో గేటును సైతం ఏర్పాటు చేయడం జరిగింది.