శ్రీ లక్ష్మీ, సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

 

 

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి డిసెంబర్ 13 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వినాయక నగర్ లో లక్ష్మీ గణపతి సరస్వతి దేవి ఆలయంలో లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి దేవి విగ్రహాలకు ప్రాత:కాల పూజ, ఆవాహిత సర్వ దేవత పూజలు, హోమం, ధాన్యాదివాసాలు, పుష్పాదివాసాలు, ఫలాదివాసం పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అలాగే బుధవారం నాడు జరిగే అత్యంత అంగరంగ వైభవంగా సర్వదేవతా పూజలు, హోమం, యంత్ర ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మి గణపతి సరస్వతీ దేవి ధ్వజ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములు పూర్ణాహుతి నేతృణ్మలనం బలి ప్రధానం కుంభం దేవతామూర్తులకు విశేష అలంకరణ అర్చనాదులు మహా నివేదన మంగళహారతి మంత్రపుష్పాదులు బ్రాహ్మణ ఆశీర్వచనం తీర్థ ప్రసాద వినియోగం అనంతరం మహాన్నదానం జరుగుతుందని కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు భజనలు ఉంటాయని వినాయక నగర దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూజారులు పాలా గణపతి శర్మ, పాలా సదాశివశర్మ, జయప్రకాష్ శర్మ, శివ ప్రసాద్ శర్మ, వినాయక నగర్ దేవస్థాన కమిటీ సభ్యులు లింగాల మధుసూదన్ రెడ్డి, కందుల వెంకట్ రెడ్డి, పాక లక్ష్మయ్య, వరికుప్పల శ్రీనివాస్, వరికుప్పల పాండు, తోటపల్లి కిరణ్, తోటపల్లి శ్రీనివాస్, మేదరి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, తోటపల్లి నాని, జబ్బు అంజయ్య, జంగయ్య, పాక రామకృష్ణ మరియు పూజలలో పాల్గొనే దంపతులు భక్తులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు