శ్రీ సరస్వతీ శిశు మందిర్ వేములవాడ లో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు
వేములవాడ, ఆగస్టు 11 (జనం సాక్షి):
ఈ రోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వేములవాడ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో రాఖీలు కట్టుకొని ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు ఆ తర్వాత వేములవాడ పట్టణ దుకాణదారులకు మరియు పోలీస్ స్టేషన్, బ్యాంక్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు, పోలీస్ సిబ్బందికి, ఆలయ ఉద్యోగులకు మరియు దేవాలయ ప్రాంగణంలోని యాచకులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను వివిధ కార్యాలయాల సిబ్బంది ప్రశంసించారు. గుడి దగ్గర ఉన్న యాచకుల్లో కొందరు కన్నీళ్లతో తమ కుటుంబాలను గుర్తుచేసుకొని పిల్లలని మీకు ఆ శివయ్య దీవెనలు ఉంటాయి నాన్న అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. పిల్లల సేవా నిరతిని మెచ్చుకొని దేవాలయ ఉద్యోగి అయిన శ్రీ ద్వారక శేఖర్ గారు పిల్లలందరికీ లడ్డూ ప్రసాదాలు కొని ఇచ్చారు. ఎప్పటికీ ఇలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించాలని పిల్లలను అభినందించారు. మొత్తంగా పిల్లలందరికీ రక్షాబంధన్ పండగ కొత్త అనుభూతిని ఇచ్చింది.