శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న

శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న -గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోతు రమేష్
కురవి మార్చి/30/జనం సాక్షి న్యూస్:అనంతరం గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని  శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న తాట్యాతండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్ ను గుడి కమిటీ అధ్యక్షులు ఆరెల్లి రాజయ్య,ఐదవ వార్డు కౌన్సిలర్ కోడి నాగలక్ష్మి _ శ్రీను,టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దెల వెంకన్న,గార్లపాటి శ్రీను,జంగి వెంకన్న,వీరితో పాటు గ్రామ నాయకులు తదితరులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గుడి కమిటీ బానోతు రమేష్ నాయక్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బానోత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ గుడి అభివృద్ధి విషయంలో నా వంతు సాయం ఎల్లప్పుడూ ఉంటాదని చెప్తూ ఆ సీతారాముల వారి కటక్షతో ఊరు చల్లగా ఉండాలని పంట పైర్లు బాగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ అసెంబ్లీ యువజన వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి సాయి,భక్తులు పాల్గొన్నారు.