షూ వేసుకులేదని విద్యార్థిని చితకబాదిన టీచర్
కరీంనగర్, జులై 6 : విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోతున్నారు. చిన్నారులను చితకబాదుతున్నారు. కేవలం షూ వేసుకుని రాలేదనే కోపంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడు. జిల్లాలోని జగిత్యాల గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి జావెద్‌ను పీఈటీ చిత్తకొట్టాడు. కాలుకు ఆపరేషన్ అయ్యిందని చెప్పినా పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాల ఎదుట బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం పీఈటీని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.