సంక్షేమాన్ని మరిచాయి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 :కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే టిడిపి అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం యాత్రను చేపట్టారని అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు. చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని, పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌ 5వ తేదీ నుండి వారంరోజులపాటు చంద్రబాబు జిల్లాలో పాదయాత్ర చేపట్టారని, ఈ యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.