సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శం:ఎమ్మెల్యే మదన్ రెడ్డి.

సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శం:ఎమ్మెల్యే మదన్ రెడ్డి

జనం సాక్షి/ కొల్చారం
సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని రై గుతు వేదికలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన, శనివారం ఇల్లు కూలిన బాధితులకు పరిహారం చెక్కులు అందజేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇళ్ల బాధితులకు 3200 రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి 1100 దళిత బంధు టార్గెట్ కాగా, అందరూ ఐక్యమత్యంతో కూర్చొని మాట్లాడుకోవాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీని దీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ ,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌర్శంకర్ గుప్తా, ఏడుపాయల డైరెక్టర్ యాదా గౌడ్, కొల్చారం గ్రామ సర్పంచ్ కరెంటు ఉమాదేవి రాజా గౌడ్, తాసిల్దార్ మమ్మద్ గఫర్ మియా, ఎంపీడీవో గణేష్ రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచులు మన్నె శ్రీనివాస్, నెల్లి కిష్టయ్య, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ముత్యం గారు సంతోష్ కుమార్, కుకునూరు సత్యనారాయణ గౌడ్, గడ్డమీది నర్సింలు, కాశీనాథ్, బండి రమేష్, రవీందర్ గౌడ్, చిట్యాల యాదయ్య, సందీప్, సోమ నరసింహులు, రాజేష్, దుర్గేష్, హరిచంద్ర, ఆత్మ డైరెక్టర్ దొడ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.