సంక్షేమ పథకాలపై అవగాహనకు చర్యలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై  గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత్‌ నిర్మాణ్‌- పౌర సమాచార ఉత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ ఉత్సవాన్ని మంచిర్యాల పట్టణంలో డిసెంబర్‌ 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవంలో 50 స్టాల్స్‌తో భారీ సమాచార ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, ప్రభుత్వ రంగ, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.