సంక్షేమ పథకాల అమలులో వివక్ష

టిడీపి తీరుపై మండిపడ్డ మాజీఎంపి

కడప,జనవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పచ్చచొక్కాల పరమవు

తున్నాయని వైసిపి నాయకులు, కడప మాజీఎంపీ నితిన్‌రెడ్డి విమర్శించారు. జన్మభూమిక్యాక్రమంతో దీనిని చేపడుతున్నారని అన్నారు. చంద్రబాబు అమలు చేసిన పథకాలు అధికార పార్టీవారికే చేరుతున్నాయని అన్నారు. ఎన్నికల హావిూల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఊసే లేదన్నారు. ప్రత్యేక¬దాపై కేంద్రంతో విభేదించి పోరాటం చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు వచ్చేదా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. శుప్రత్యేక¬దా వేరు-ప్యాకేజీ లు వేరు అన్నారు. విభజన చట్టంతో పోలవరం ప్రాజెక్టును చేర్చి, కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పూర్తి బాధ్యతలు చేపట్టాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దాదాపు రూ. 5వేల 500కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు చేపట్టా రన్నారు. రూ.16వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.43 వేల కోట్లకు పెంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి తన అనుయాయులకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు వైఎస్‌ హయాంలో దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన విషయం చంద్రబాబు మరచిపోయారని ఎద్దెవా చేశారు. ప్రత్యేక¬దా సాధించేంతవరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోరాటం సాగిస్తూనే ఉంటుందన్నారు.