సంక్షేమ పథకాల తో ప్రజల వ్యక్తిగత వికాసానికి తోడ్పాటు అందించాలి.
-మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ శైలేష్ కుమార్
మహబూబాబాద్ బ్యూరో-జూలై 17(జనంసాక్షి)
స్వచ్ఛతతో పాటు అవసరమైన వనరులను సమకూర్చుకొని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి దేశ ప్రగతిలో జిల్లా భాగస్వామ్యం కావాలని కేంద్ర బృందం సభ్యులు కోరారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో జిల్లాలో గత 4రోజుల నుండి పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు డైరెక్టర్ ఆఫ్ ఆర్ హెచ్ (హౌసింగ్) శైలేష్ కుమార్, వై సి ఈ (ఎన్ ఆర్ ఐ డి ఎ) పుల్ కైత్, పి ఓ సి డి (ఎన్ ఆర్ ఇ జి ఎ) నీల్ రతన్ లను జిల్లా కలెక్టర్ కె.శశాంక తన చాంబర్ పూల బొకె లు అందజేసి వారిని ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే దేశ ప్రగతి సాధించినట్లేనని, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా వినూత్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ వివిధ పనులపై, గ్రామాల్లోని అభివృద్ధి స్థితిగతులు, సిసి రోడ్ల నిర్మాణం, ఎం ఐ ట్యాంక్యూ లు, సెగ్రీ యేషన్ షెడ్ లు , నర్సరీలు, వైకుంఠధామాలు , ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు,ఫాoడ్స్, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణాలు, గ్రామాల్లోని పారిశుద్ధ్యం, ఇంకుడు గుంతలు, రైన్ వాటర్ ,బ్లాక్ వాటర్ హార్వెస్టింగ్, పబ్లిక్ టాయిలెట్స్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై పర్యవేక్షిస్తూ మరిపెడ, డోర్నకల్ మండలాల్లోని అనేపురం, అబ్బాయి పాలెం, నీలికుర్తి, తోడేళ్ళ గూడెం, బొడ్రాయి తండా, వెన్నారం పర్యటించి ఎన్ఆర్ఈజీఎస్ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పనిసరియని, రోడ్ల కనెక్టివిటీ చాలా బాగుందని, కేంద్ర బృందం సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు. జిల్లా సమాచారాన్ని సభ్యులు కోరగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ 16 మండలాలు, 461 గ్రామ పంచాయితీ లతో నూతన జిల్లాగా ఏర్పడిందని,5 ఏజెన్సీ మండలాలు ఉన్నాయని,4 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఇది పార్లమెంట్ స్థానమని, మహబూబాబాద్, డోర్నకల్ 2 పూర్తి నియెజకవర్గాలతో,3 అనుబంధ నియోజకవర్గలతో సుమారు 8 లక్షల జనాభా,3 జాతీయ రోడ్లు రవాణా సౌకర్యం కలదని, 2015 నుండి విడతలవారీగా బృహత్తరమైన హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని 8 వ విడతలో చేపట్టామని, జిల్లావ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నాటడం జరిగిందని, జూన్ 3 వ తేదీనుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి,4 విడత పట్టణ ప్రగతి నిర్వహించి ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ క్లీనింగ్, ముళ్ల పొదలు చెట్లను తొలగించడం, మిషన్ భగీరథ త్రాగునీరు అందిస్తున్నట్లు, జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుండి 30వ తేదీ వరకు నిర్వహించి ప్రతి ఒక్కరికి విద్య ప్రాథమిక జన్మహక్కు అని ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే దృక్పథంతో జడ్పీహెచ్ఎస్ లు 100, గౌట్ హైస్కూల్ 2, ఎంపీపీ ఎస్ లు 676, యూ పీ ఎస్ లు 120, ఆదర్శ పాఠశాలలు 8, ఈ ఎం ఆర్ ఎస్ ఏకలవ్య పాఠశాలలు 5, కేజీబీవీ లు 15, కేంద్రీయ విద్యాలయం 1, బీసీ వెల్ఫేర్ 5, మైనార్టీ గురుకులాలు 3, ఎస్సీ వెల్ఫేర్ లు 5, మదర్సాలు 4, మినీ గురుకులాలు 2, అర్బన్ రెసిడెన్షియల్ 1, ఎం సి ఎల్ పి లు 5 ఆశ్రమ పాఠశాలలు 5, ఏ డెడ్ పాఠశాలలు 22 , ప్రైవేట్ పాఠశాలలు 128, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు22, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 5, ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్ లు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు , మానసిక శారీరక దృఢత్వానికి తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని పలురకాల వసతులు కల్పిస్తున్నామని, ఎడ్యుకేషనల్ హబ్ గా ఎదుగుటకు తగు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గ్రామీణ రైతుల వ్యవసాయ రంగానికి, సాగునీరు కు కాకతీయుల కాలం నాటి వైభవంగా గొలుసుకట్టు చెరువుల పూడిక తీతకు ప్లాంటేషన్ కు మొదలగు ఉపాధి హామీ కూలీలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సుమారు 32 శాఖలతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాన్ని త్వరలోనే ప్రారంభించుకోబోతున్నట్లు, గ్రామాల్లో నర్సరీలు, 702 పల్లె ప్రకృతి వనాలు, ప్రతి మండలానికి బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సెగ్రీషన్ షెడ్యూల్, కంపోస్టు యార్డు, పల్లెల్లో, పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు స్వచ్ఛతకు ట్రాక్టర్లు ,ట్రాలీ ల ద్వారా చెత్త సేకరణ చేస్తూ గ్రీన్ బ్లూ తడి చెత్త పొడి చెత్త డబ్బాలు అందజేసి నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లు, పంచాయతీ కార్యదర్శుల కృషి శ్రమ వల్లే పల్లెల్లో పారిశుద్ధ్యం విజయవంతంగా స్వచ్ఛత వైపు ప్రయాణిస్తున్నాయిని, వైద్యపరంగా జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ పరీక్షలు మందులు అందుబాటులో ఉన్నాయని, పి హెచ్ సి లు సబ్ సెంటర్ ల తో వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర బృందం సభ్యులతో సుదీర్ఘంగా పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించు కునేలా చూడాలని, ఖే లో ఇండియా స్థాయిలో శిక్షణ ఇప్పించుటకు అర్హత గల కోచ్ ల ద్వారా శిక్షణ ఇప్పించి, ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా మైదానాలు పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని, రోడ్డు కనెక్టివిటీ బాగుందని, ప్రాచీన దేవాలయాలు, కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు, జలపాతాలు, వాగులు పచ్చని అడవులతో సుందరంగా ఉందని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో కమిషనరేట్ డైరెక్టరేట్ రబ్బాని భాష, డి ఆర్ డి ఓ సన్యాసయ్య, అడిషనల్ డి ఆర్ డి ఓ దయాకర్ లు పాల్గొన్నారు.