సంక్షేమ హాస్టళ్లను మూసేయడం లేదు: మంత్రి
ఏలూరు,ఆగస్ట్18(జనం సాక్షి): సంక్షేమ హాస్టళ్లను మూసేయడం లేదని వాటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జవహర్ అన్నారు. విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్‌ఆరు. రాష్ట్రంలో ఏడువేల మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న డ్రాపౌట్ల నివారణకు డిగ్రీ, పిజి వరకు రెసిడెన్షియల్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి రావెళ్ల కిషోర్‌బాబు అన్నారు. ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, సబ్‌ప్లాన్ ద్వారా ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగాఅప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని అన్నారు. చంద్రన్న చేయూత ద్వారా 20 కోట్ల ఖర్చుతో పదివేల మంది నిరుద్యోగ యువతకు స్కిల్డ్ డెవలప్‌మెంట్ నిర్వహించామన్నారు. చంద్రన్న దళితబాట కార్యక్రమం ద్వారా వివిధ దళిత కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. విదేశీల్లో ఉన్నత విద్య చదువుకోడానికి అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి ద్వారా దళిత విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్ విద్యోన్నత పథకం ద్వారా హరిజన గిరిజన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామన్నారు.