సంఘం పనితీరు అభినందనీయం
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని సందర్శించిన నాబార్డ్ అధికారులు
ఫోటో రైట్ అప్ :సహకార సంఘం చైర్మన్ నాబార్డ్ రీజినల్ అధికారి ఎంవీఎస్ ఎస్ శ్రీనివాస్
చొప్పదండి, జూలై 31( జనం సాక్షి ): చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం ఇతర సంఘాలకు దీటుగా అభివృద్ధి చెందుతూ రైతులకు సేవలందిస్తూ సంఘ పనితీరు చాలా బాగుందని నాబార్డ్ తెలంగాణ రీజనల్ డీజీఎం ఎన్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ అభినందించారు. సోమవారం చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను NABARD, TELANGANA REGIONAL OFFICE నుండి MVSS SRINIVAS (D.G.M) గారు సందర్శించారు . సంఘ అధ్యక్షులు వెల్మ మల్లారెడ్డి , సీఈఓ కళ్లెం తిరుపతి రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
సంఘం కార్యాలయం , గోదాములు, ఫెర్టిలైసర్, పెస్టిసైడ్,బియ్యం అమ్మకాలు, బ్యాంకు లావాదేవీల గురించి వివరించారు. KDCCB resources person సత్యనారాయణ సంఘం ద్వారా రైతులకు అందుతున్న రుణాల గురించి, NABARD ద్వారా అమలైన UPNRM ప్రాజెక్ట్ యందు లబ్ది పొందిన రైతుల గురించి వివరించారు.అధ్యక్షులు వెల్మ మల్లారెడ్డి మాట్లాడుతూ సంఘం సభ్యులకు సరైన సమయంలో పంట రుణాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తున్నమని , రైతులకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించుటకు ప్రతి గ్రామంలో గోదాములు నిర్మించి ఎరువుల అమ్మకాలు చేపడుతున్నామని తెలిపారు .పంట రుణం సరిపోని రైతులకు ఎకరానికి 20,000/- సంఘం స్వంత నిధులతో అందజేస్తున్నమని తెలిపారు. సంఘం సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి 10,000/- ఆర్ధిక సహాయం చేస్తున్నామని, 58 సం. లోపు ఉన్న పంట రుణం పొందిన ప్రతి సభ్యునికి ప్రమాద బీమా చేశామని తెలిపారు,ప్రతి సం.రం నిరుపేద విద్యార్ధినులకు రూ. 5వేలు ఆర్ధిక సహాయం అందజేస్తున్నమని తెలిపారు.సభ్యులకు మరిన్ని సేవలు అందించుటకు సంఘం తరపున మా పాలక వర్గం ఏళ్ల వేలాల కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా DDM లు జయప్రకాష్ , మనోహర్ రెడ్డి , సంఘం డైరెక్టర్లు నాంపెల్లి మల్లయ్య, గుర్రం ఆనంద రెడ్డి, కొస్న తిరుపతి రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.