సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాలి

 జిల్లా ఎస్.పి.  ఆర్.వెంకటేశ్వర్లు
మహబుబ్ నగర్ ఆర్ సి ,సెప్టెంబరు 30, (జనంసాక్షి ):
శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అదే సందర్భంలో సామాన్య ప్రజల నమ్మకం చూరగొనేందుకు కృషి చేయాలని రాష్ట్ర డి.జి.పి.  ఎం.మహేందర్ రెడ్డి తెలియజేశారు . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  శుక్రవారం మధ్యాహ్నం డి.జి.పి.  శాంతిభద్రతల సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు  జిల్లాకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.పాత కేసుల దర్యాప్తు పూర్తి చేయడంలో సీనియర్ పోలీస్ అధికారుల సమన్వయముతో ప్రత్యేక చర్యలు.
జైలు నుంచి విడుదలైన మరియు పాత నేరస్థుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా.జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ పట్ల సిబ్బందికి శిక్షణ.స్థానిక సమస్యలను పరిష్కరించే క్రమంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లకు అవగాహన కల్పించే తరగతులు.
నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై నిఘా కొరకు పోలీస్ బృందాల ఏర్పాటు.సైబర్ మోసాల ద్వారా డబ్బులు పోగొట్టుకున్నవారు ఇరవై నాలుగు గంటల్లోపుగా 1930 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, పోలీసు సహాయం అవసరం అయిన అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసే విషయంలో అవగాహన.నేను సైతం మరియు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో సి.సి. కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు .ఈ
సమావేశంలో డి.ఎస్.పి.లు రమణారెడ్డి, మధు, ఆదినారాయణ, లక్ష్మణ్, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ.లు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area