సంచలన సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దినోత్సవం..
బాన్సువాడ, సెప్టెంబర్ 17 (జనంసాక్షి):
నైజాం విముక్తా స్వాతంత్ర్య అమృత్సర్లో భాగంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ వివిధ క్షేత్ర- “సంచలన సమితి “ఆధ్వర్యంలో బాన్సువాడ మండల కేంద్రంలో సెప్టెంబర్ 17 విమోచన దిన సందర్భంగా జాతీయ జెండా సత్యనారాయణ గారిచే ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం సంచలన సమితి జిల్లా ప్రతినిధి, భూనేకర్ సంతోష్ మాట్లాడుతూ నిజాం నవాబు పాలనలో తెలంగాణ ప్రజల్ని ఘోరమైన చిత్రహింసలు పెడుతూ, దాడులు దోపిడీ, మహిళలపై అత్యాచారాలు ,హత్యలు చేయడం జరిగింది. బైరాన్ పల్లి గ్రామంలో రజాకార్లు 118 మందిని హత్య చేసి ఆ శవాల చుట్టూ తెలంగాణ మహిళలని నగ్నంగా బతుకమ్మ ఆడించారు .బైరాన్ పల్లి ఘటనతో కేంద్ర సర్కారు స్పందించి నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సైనిక చర్య వల్ల నిజాం నవాబు తలవంచి తెలంగాణను భారత్ యూనియన్ లో కలపడం వలన తెలంగాణ రాష్ట్ర విమోచన జరిగింది. సంచలన సమితి ఆధ్వర్యంలో సంవత్సరం పాటు నైజాం విముక్తా స్వాతంత్ర్య అమృత్యోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో విభాగ్ వ్యవస్థ ప్రముక్ సత్యనారాయణ, కర్ణం రాములు , కిష్టయ్య ,నిమ్మ సాయి, క్రాంతి కుమార్ తపస్ సంఘ ప్రతినిధులు భునేకర్ సంతోష్ జంగిల్ రాజు , శ్రీకాంత్ రెడ్డి, ప్రతినిధులు రవీందర్ గౌడ్, లక్ష్మణ్ , వెంకట్, సాయిలు భూమయ్య , ఆర్ఎస్ఎస్, తపస్, విశ్వహిందూ పరిషత్, బిఎంఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.