సంజీవరెడ్డి జీవితం అందరికి మార్గదర్శకం: గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి సాధించిన రైతు బిడ్డ  నీలం సంజీవరెడ్డి అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్దాంతాలకు, నైతిక విలువలకు సంజీవరెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితం మనందరికి మార్గదర్శకమని పేర్కొన్నారు.