సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు

తనమడుగు : తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మృతి చెందిన విద్యార్థి సంతోష్‌కు ఈ రోజు ఉదయం తెలంగాణ వాదులు కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్‌ పార్థివదేహం స్వగ్రామమైన తనమడుగు చేరడంతో వందలాది మంది తెలంగాణవాదులు గ్రామానికి చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు చేతబూని ఘన నివాళులర్పించారు