సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పెద్ద పీఠం
సంస్కృతి సాంప్రదాయం నుండే ఆస్తిత్వం ఏర్పడుతుందని మన సంస్కృతి సాంప్రదాయాలలో గౌరవం ఇమిడి ఉందని తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సాంస్కృతిక వేడుకలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ కె.శశాంక, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నందన గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేడుకలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సాంస్కృతిక వేడుకలనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బానిస సంకెళ్ల నుండి స్వయం పాలన తీసుకొని వచ్చేందుకు ఎందరో త్యాగాలు చేశారని వారి త్యాగాలను స్మరించుకుంటూ చరిత్ర నుంచి నేర్చుకొని బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణలో భాగస్వాములైన జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసు, మీడియా వారికి జిల్లా కలెక్టర్ అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే చంద్రశేఖర రావు ఆదివాసులు గిరిజనులకు అద్భుతమైన వరాలు ఇచ్చారని శాసనసభ్యులు తెలిపారు. 10% రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు, దళిత బంధు మాదిరిగా గిరిజన బంధు ప్రకటించి ఆదివాసుల, గిరిజనుల జీవితాలలో మరిన్ని కాంతులు నింపారని ఆయన తెలిపారు. గతంలో ఏ పాలకులు హరిజన, గిరిజన ఆదివాసుల గురించి ఆలోచన చేయలేదని ఆదివాసులు, గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండాలని హైదరాబాద్ మహానగరంలో సంత్ సేవాలాల్, కొమరం భీం భవనాలను గిరిజనుల కొరకై ఏర్పాటు చేశారని శాసనసభ్యులు చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం గిరిజన రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి ఉన్నత విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని విద్యార్థులు క్రమశిక్షణ ఏకాగ్రతతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు సాకారం అవుతాయని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి ఆంగొత్ బిందు మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు నిర్ణయం పట్ల గిరిజన జాతి మొత్తం ముఖ్యమంత్రి వర్యులకు రుణపడి ఉంటుందని, గతంలో ఆదివాసులు గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తూ ఆదివాసులు గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపినదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అన్నారు. ఎస్ పి శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణ కలెక్టర్ పరమర పింకేశ్వర్ కుమార్ లలిత్ కుమార్, మరో అదనపు
ఎం డేవిడ్, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచందర్ రావు, జడ్పిటిసి శ్రీనివాస్, పెద్దవంగర ఎంపీపీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి నర్మద ఆర్డిఓ కొమురయ్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సాంస్కృతిక వేడుకల సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను కళాకారులను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక వేడుకలలో డోర్నకల్ కేజీబీవీ విద్యార్థులు, ఉదయశ్రీ అకాడమీ కూచిపూడి నృత్యం, చింతూరు మండలం ఆదివాసి కొమ్ము బృందం, డోర్నకల్ నీలం బృందం బంజారా నృత్యం, రాయప్రోలు సుబ్రహ్మణ్య శర్మ వయోలిన్ సంగీతం, గూడూరు మండలం మునుగోడు వీరస్వామి బృందం డప్పు వాయిద్యం, ఫైర్ రవి మ్యాజిక్ షో, తదితర కార్యక్రమాలు వీక్షకులను ఆహ్లాదింప చేశాయి.