సఖ్యత కేంద్రాన్ని సందర్శించిన ఆర్కేపీ ఎస్.ఐ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో గృహహింస నిరోధంపై అవగాహన కల్పించాలని సఖ్యత కుటుంబ సలహా, వర్తిత్వ కేంద్రం నిర్వాహకులకు పట్టణ
ఎస్ఐ జి రాజశేఖర్ సూచించారు. పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో గల సఖ్యత కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. బాధిత మహిళలకు అందిస్తున్న సౌకర్యాలు, కౌన్సిలింగ్, తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ఫ్యామిలీ లీగల్ కౌన్సిలర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాల్య వివాహాలు,ఫోక్సో, వరకట్న వేధింపులు, మారక ద్రవ్యాలు తదితర అంశాలపై వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సఖ్యత నిర్వాహకులు,అడ్వకేట్ ఫ్యామిలీ కౌన్సిలర్, ఆర్బిట్రేటర్ రాజలింగు మోతె, మేనేజర్ కొండ శ్రీనివాస్, కోఆర్డినేటర్ కలవల సతీష్ కుమార్, సభ్యులు న్యాయవాది ముల్కల కనకయ్య, ఏల్పుల వెంకటస్వామి, దుర్గం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.