సచివాలయంలో ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రైవేట్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ డైరెక్టర్‌ వ్యవహారంపై చర్చించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులతో వ్యవహరించాల్సిన అంశంపై అధికారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు.