సత్ఫిలితాలు ఇస్తున్న తెలంగాణ పారిశ్రామిక విధానం: చారి

న్యూఢిల్లీ,జూలై19(జ‌నం సాక్షి): సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని ఇది పెట్టుబడులకు ఇస్తున్న ఊతంగా చాడలని మాజీ ఎంపి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణగోపాలచారి అన్నారు. 2017 సంవత్సరానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిదిలోని పారిశ్రామిక విధాన పోత్సాహక విభాగం ప్రకటించిన ర్యాంకులో స్వల్ప తేడాతోనే మొదటి ర్యాంకు కోల్పోయామన్నారు. తెలంగాణలో పారిశ్రామిక విధానం ప్రపంచ దేశాలను ఆకర్శిస్తోందని అన్నారు. వివిధ దేవాలు పెట్టుబడుల కోసం తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తుందని, నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నారు. నాలుగో విడత హరితహారం విజయవంతం చేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ నిర్ణయం దేశ వ్యవ్యసాయం రంగంలోనే సంచలనంసృష్టించిందని చెప్పారు. రైతులకు పెట్టుడికి ఏడాదికి ఎకరానికి రూ.8వేలు అందజేయడంపై దేశవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు సైతం పథకం అమలుపై ఆలోచన చేస్తున్నాయన్నారు.మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలు రోల్‌మోడల్‌గా నిలిచాయని, వీటి ద్వారా గ్రామాల్లో చెరువులన్నీ ఆధునికీకరించడంతో పాటు, ఇంటింటికీ శుద్ధజలాలు అందిస్తున్నట్లు చెప్పారు. కల్యాణక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు పథకాలతో పాటు ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి అందిస్తూ నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నట్లు తెలిపారు.