సనాతన ధర్మం పై ఉదయ్ నిధి స్టాలిన్ అనుచిత వాఖ్యలు నిరసిస్తూ….. పిండప్రధానం చేసిన వాస్తు సిద్ధాంతి సత్యం
సనాతన ధర్మంపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిది స్టాలిన్ వైఖరిని నిరసిస్తూ… మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక పందిర్లపల్లి చెరువు వద్ద ఉదయ్ నిది స్టాలిన్ చిత్ర పటానికి పిండ ప్రదానం చేశారు.అనంతరం పిండాలను చెరువు లో కలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటారని.. వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉదయనిది స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ దేశంలో సంపదలను,పదవులు అనుభవిస్తూ సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు సర్వేజనా సుఖినోభవంతు అని కాకుండా,ధర్మజన సుఖినోభవంతు అని దీవించాలని కోరారు.సనాతన ధర్మం జోలికొస్తే యావత్ హిందూ సమాజం తీవ్రంగా స్పందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా సనాతన ధర్మంపై అనిచిత వ్యాఖ్యలు చేస్తే బ్రతికుండగానే పిండాలు పెడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో రమణ తదితరులు వున్నారు.