సబ్బులు, షాంపోలతో ముప్పు!
ఒకరికి లక్స్ సోప్ ఇష్టం. మరొకరికి రెక్సోనా ఇష్టం. ఇంకొకరికి డౌ ఇష్టం. ఒకరికి హెడ్ అండ్ షోల్డర్ షాంపో ఇష్టం. మరొకరికి క్లినిక్ ప్లస్ ఇష్టం. ఇంకొకరికి చిక్ షాంపో ఇష్టం. ఎవరికి ఏవి ఇష్టం ఉన్నా.. వాటిలో వాడి రసాయనాలతో ఇబ్బందులు తప్పవంటున్నారు పరిశోధకులు. వీటి వాడకం వల్ల గర్భస్రావాలు పెరుగుతున్నాయని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉత్పత్తులలో గర్భస్రావానికి కారణమయ్యే ఆరు రకాల ప్యాథలెట్ల జాడలు కనిపిస్తున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన జియాంగ్ తెలిపారు. ఇప్పటికే చిన్నిపిల్లల ఉత్పత్తుల తయారీలో వీటిని వాడొద్దంటూ అమెరికా నిషేధించింది. అయితే పలు రకాల ఇతర ఉత్పత్తులలోనూ వీటి ఆనవాళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.