సమగ్ర చేపల పెంపకం విధానాన్ని వివరిస్తున్న కేవీకే కో ఆర్డినేటర్ హెడ్ బి. లవకుమార్

గరిడేపల్లి, ఆగస్టు 7 (జనం సాక్షి): మంచి నీటి చేపల పెంపకం చేస్తున్న రైతులు సమగ్ర చేపల  పెంపకం విధానాలను  పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చునని కేవీకే  ఇంచార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ హెడ్ బి. లవకుమార్  అన్నారు. ఆదివారం కేవీకే గడ్డిపల్లి  లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక  యువతకు  జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి   సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్   ఇన్ పబ్లిక్  సిస్టమ్  వారి  ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ లో భాగంగా  సమగ్ర చేపల పెంపకం  పద్ధతులపై  అవగాహన కల్పించినట్లు  తెలియజేసారు.  వ్యవసాయ ఉద్యాన పశుపోషణ   మొదలగు ఇతర పంటలను  చేపల  పెంపకంతో  అనుసంధానం చేయడాన్ని సమగ్ర   సమీకృత   చేపల  పెంపకం అని అంటారని  తెలియజేసారు. చేపల  పెంపకంను  ఇతర పంటలను  అనుసంధానం చేయడం  వలన  పరిమిత భూమి నీటి  వనరులలో  ఏక కాలంలో  బహుళ ఆదాయం పొందవచ్చు నని అన్నారు. పశు పోషణ లో వచ్చే వ్యర్దాలను విసర్జితాలను   చేపల  పెంపకంలో వినియోగించుకొని   పెంపకం ఖర్చును  తగ్గించుకోవచ్చునని   తెలియజేసారు. ఈ  విధానంలో  సహజ వనరులను సమర్థవంతగా  వినియోగించుకోవచ్చునని   అదనపు ఆదాయం పొండటానికి  వీలుంటుదని  అన్నారు.  రైతులు  తమకున్న  వనరులను  వినియోగించుకొని చేపలు కోళ్లు చేపలు బాతులు చేపలు  పశువులు చేపలు  పందులు చేపలు  వరి చేపలు  హార్టికల్చర్   మొదలగు పెంపకాలను   చేపట్టి   తక్కువ  ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందవచ్చునని  తెలియజేసారు. ఈ శిక్షణ లో  సందీప్, నరేష్, సైదులు,సురేందర్,వెంకన్న , ప్రమీల, నవ్య, రాణి,మౌనిక, మమత లతో  పాటు 30 మంది పాల్గొన్నారు.