సమస్యలపై ప్రజల ఆందోళన
విజయనగరం,సెప్టెంబర్4(జనం సాక్షి): అధికారులు స్పందించి విజయనగరం పట్టణంలోని వైఎస్‌ఆర్ కాలనీలో మురికి కాలువల ఏర్పాటు, తాగు నీటి సరఫరా, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కాలనీ ప్రజలు కోరారు. ఈ మేరకు ఎఐఎఫ్‌టియు-ఎన్‌వైఎస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్‌ఆర్ కాలనీ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. నృత్య ప్రదర్శన చేస్తూ తమ డిమాండ్‌లను తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమా! అభివృద్ధి అంటే ఇదేనా! అనే ఫ్లెక్సీ బ్యానర్లతో తమ నిరసన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శంకరరావు, నవయువ సమాఖ్య జిల్లా అధ్యక్షులు మద్దిల అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.